Sunday, September 7, 2014

మరపురాని మనిషి - మా రాముడు తాతగారు

ఇది రాయాలని చాలానాళ్లుగా సంకల్పం ఉన్నా తెలుగులోనే రాయటం సబబు అనిపించడంతో ఆలస్యం అయింది. రాముడు తాతగారు పరమపదించి 20ఏళ్లు అయినా ఆయన వ్యక్తిత్వం వల్ల చిరస్మరణీయులు. వారు కాకినాడ వాస్తవ్యులు. నా బాల్యంలో వేసవి, పండగ శెలవులు ఇవ్వడం ఆలస్యం కాకినాడ వెళ్లడానికి ఉవ్విళ్ళూరే వాడిని. దానికి ఒక కారణం మా నాన్నమ్మగారింట్లొ ఉసిరి చెట్టు, పక్కన ఉన్న ఉయ్యాల, మరొక ముఖ్యకారణం మా అమ్మమ్మగారింట్లొ రాముడు తాతగారు చెప్పే కధలు, విషయాలు.


ఒక మనిషిని జీవించి ఉండగా తలచుకోవడం పెద్ద విషయం ఏమీ కాదు, కానీ మరణించిన తర్వాత కూడా తలచుకోవడానికి మంచితనం మాత్రమే కారణం అవుతుంది.
చూడచక్కని రూపం, మనిషి మంచి పొడగరి, ఆజానుబాహువు, నల్లటి ఉంగరాల జుట్టు, నగుమోము, మృదుభాషి. శాంతమూర్తి, బహుచమత్కారి చలోక్తులు వెయ్యడంలో దిట్ట. ఏ పని చేసినా ఒక పద్దతిగా చేయడం రాముడు తాతగారిలొ ప్రత్యేకత. అది రోజు చేసే భోజనం కావచ్చు, తినే కంచంలో ఒక్క పదార్దం వదలకుండా ఒక్క మెతుకు మిగల్చకుండా తినేవారు. ఆన్నం పరబ్రహ్మ స్వరూపం అని చేతల ద్వారా చెప్పేవారు. నేను ఏ రోజైనా అలా తింటే నా భార్యతో 'మా రాముడు తాతగారిలా అందంగా తిన్నా ' అనడం రివాజు. రామకోటి రాస్తే ఒక పేజిలో లింగాకారంలో, ఒక పేజిలో ' శ్రీరామ ' నామాకారంలొ రాసి ముత్యాల్లాంటి అక్షరాలతో చూడముచ్చటగా ఉండేది.

మా పెద్దన్నగారు (మైదిలి) ఆయనలా ఆజానుబాహువు. మా చిన్నన్నయ్యకు (పవన్) మరియు నాకు మృదుభాషణ కొద్దిగా అలవడ్డాయి. మా తమ్ముడు (కిరణ్) ఆయనలాగె పొడుగరి. మా మావయ్య కుమారుడు (శ్రీరాం) ఆయనవలె చమత్కారి. కాని మాకెవ్వరికి ఆయనవంటి పరిపూర్ణత సిద్దించలేదు.

చిన్ననాడు ఆయన చెప్పిన కధలు నేటికీ నేను మరువలేదు. విరామం లేకుండా నేను అడిగే ప్రతి ప్రశ్నకు విసుగు లేకుండా ఆయన చెప్పిన సమాధానాలు నాలో ఆలొచించే స్వభావానికి పునాది వేశాయి. మేమంటే అపారమైన ప్రేమ చూపించేవారు. దినచర్యలో ఆయన చూపే నిబద్దత ఆదర్సప్రాయం. ప్రతి నెల క్రమం తప్పకుండా ఆయన పంపే కుశలప్రశ్నలతో నిండిన పోస్ట్ కార్డ్ కోసం ఎదురుచూసిన రోజులు ఎన్నో. ఒక్క కార్డ్‌లొ సకల విషయాలు పట్టించడంలో ఆయన చూపిన ప్రజ్ఞ ఎన్ని కమ్మ్యూనికేషన్ కోర్స్‌లు చేసినా రాదు. ఆ దస్తూరిలో అందం ఆయనకే సొంతం.

ఆయన నేను 7వ తరగతిలొ ఉండగా స్వర్గస్తులైనారు. వెళ్తూ కూడా నాకు ఒక కొత్త విషయం చెప్పారు, అబ్బాయి ఈ ప్రపంచంలో ఎవరూ శాశ్వతం కాదు అని. 7వ తరగతి విద్యార్దికి అది ఒక మహావిషయం. కాని ఈనాటికి ఆయనలేని లోటు తీర్చలేనిది. మా అభివృద్ధి చూసి ఆనందించేవారు, మాకు కష్టాలలో సలహా చెప్పేవారు. నా జీవితంలోని మరపు రాని మనిషికి అశ్రునయనాలతో.

3 comments:

Sriram said...
This comment has been removed by the author.
Sriram said...

Thanks bava for this write up on Tatagaru. You gave us a chance to recollect the time spent with him.

Nijanga, tatagaru lanti manishi chala arudu. Andariki adarsa prayam. Nenu ayanatho chala thakkuva samayam gadipinapattiki, naaku gurthundi nenu edi adigina ventane thechi unchevaru naa mundu. Antha prema manvallanna, manavarallanna.

Ayana ee patiki mana madhya undi unte, chala abhimanam gaa undevaru. Enno nerchukune vallam ayana daggarininchi. Tatagaru thudi swasa vidiche mundu nannu pilichi ayana gundelameeda raayamanadam naa jeevitham lo marchipoleni sanghatana.

Thanks again bavaa. Seriously, I mean it.

Shark said...

I know you mean every letter of it, like the way I meant every word of the what I wrote. We would definitely have become better individuals, if we had fortune of his company longer.