Friday, September 19, 2014

నర నరాలలో జీర్ణమైన రామనామం

తెలుగు వాళ్లకు రాములవారికి గల సంబంధం విశిష్టమైనది. రామమందిరం లేని ఊరు తెలుగు సీమలో ఉండదంటే అతిశయోక్తి కాదు. పసిపాపలు కూడా రాములవారిని చూస్తే జేజి పెట్టక మానరు. రామాలాలి పాడి పిల్లలను నిద్దురపుచ్చడం తెలుగుపడుచులకు అలవాటు.

కలియుగమునందు నామసంకీర్తన వల్ల పాపరాశి నాశనమగునని శాస్త్రవాక్కు. ఆశ్చర్యమందిన వేళ అయ్యోరామా! అను మాట మిగుల వాడుదురు. ఏదేని చూడకూడని దృశ్యం చూచిన, వినజాలని మాట వినినగాని రామరామయని అందురు. అన్నార్తులు అన్నమోరామచంద్రా! అని ఏడ్చెదరు. ఏ ప్రభువేని ప్రజను రంజించిల్లునట్లు పాలించిన రామరాజ్యమును తలపించెనని నుడియాడుదురు.  ఉదయమందు కౌసల్యా సుప్రజా రామా అను మంత్రం మార్మోగును. పిల్లలకు అనుదినం శ్రీరామ రక్ష కట్టుట తెలుగు తల్లుల దినచర్యలో భాగమైనది.  క్రొత్త పుస్తకమును ఆరంభించుట శ్రీరామ వ్రాయుటతోనే. 

శ్రీరామ నామము తెలిసిపలికిన, తెలియక పలికిన పాపరాశి ధ్వంసమగును. ఒకనాడు దారిదోపిడి చేయుదొంగలు ఇట్లు మాట్లాడుకొనిరట 'వనేచరామ వసుచరామా' అనగా 'వనమందు సంచరించెదము, యాత్రికులను దోచుకొందుము'. కాని వారి పలుకులయందు రామ నామముచ్చరించుట మాత్రం చేత వారు  సద్గతుల  పొందిరి. అది రామనామ మహిమ.

Sunday, September 14, 2014

Beauty is skin deep?


A thing of beauty if a joy for ever says John Keats. But the question arises immediate is what is beauty?

Beauty is a subjective thing. What one finds beautiful may not be seen same by other. This is in someway a good feature. Imagine every person wanting to have same beautiful thing in his/her possession. This can lead to conflicts at minimum and wars at maximum. Remember Helen's beauty is what has caused Trojan war and brought the entire Troy down. An Artist sees a beauty in the world and creates an immaculate piece of art that reflects it. We might also see the same scene day in day out, how ever we fail to recognize its beauty that's depicted by the artist.

Is beauty really skin deep? I am sure in the real world we see men running behind fair skinned girls and girls falling for handsome boys. In the youth, outward beauty glitters but doesn't it fade away after the age grows? Does this mean we do not find beauty in older people?

In Indian scriptures there are two places where synonym of beauty (Saundrya/Sundara) is used. One is Saundarya Lahari verses by Adi Sankaracharya on goddess Parvati and other is Sundarakanda in Ramayan. Ramayan goes to the extent of stating, Hanuman is Sundara Kapi but it does not refer to the outward beauty.

External Beauty is accentuated by Internal beauty but converse may not always be true. A person who is leading a serene life with no malice in any of his deeds and no evil thoughts carries a serene beauty that is usually non-imitable by any make-up. A person who is always surrounded by evil thoughts and indulges in evil deeds, carries certain black dot on the face despite outward beauty. This phenomenon is common, but not so easy to put in words.

Person with internal beauty usually exhibits a calm and patient disposition. He/She typically has undisturbed sleep at nights and unperturbed day. Ornaments usually used to augment beauty of person, but the person with character augment beauty of ornaments as per Vidura in Mahabharat. Also outward beauty is to be worn out and disappear as person ages, where as inner beauty not only flourishes with age but also earns respect. So its obvious that beauty is definitely not skin deep.

Sunday, September 7, 2014

మరపురాని మనిషి - మా రాముడు తాతగారు

ఇది రాయాలని చాలానాళ్లుగా సంకల్పం ఉన్నా తెలుగులోనే రాయటం సబబు అనిపించడంతో ఆలస్యం అయింది. రాముడు తాతగారు పరమపదించి 20ఏళ్లు అయినా ఆయన వ్యక్తిత్వం వల్ల చిరస్మరణీయులు. వారు కాకినాడ వాస్తవ్యులు. నా బాల్యంలో వేసవి, పండగ శెలవులు ఇవ్వడం ఆలస్యం కాకినాడ వెళ్లడానికి ఉవ్విళ్ళూరే వాడిని. దానికి ఒక కారణం మా నాన్నమ్మగారింట్లొ ఉసిరి చెట్టు, పక్కన ఉన్న ఉయ్యాల, మరొక ముఖ్యకారణం మా అమ్మమ్మగారింట్లొ రాముడు తాతగారు చెప్పే కధలు, విషయాలు.


ఒక మనిషిని జీవించి ఉండగా తలచుకోవడం పెద్ద విషయం ఏమీ కాదు, కానీ మరణించిన తర్వాత కూడా తలచుకోవడానికి మంచితనం మాత్రమే కారణం అవుతుంది.
చూడచక్కని రూపం, మనిషి మంచి పొడగరి, ఆజానుబాహువు, నల్లటి ఉంగరాల జుట్టు, నగుమోము, మృదుభాషి. శాంతమూర్తి, బహుచమత్కారి చలోక్తులు వెయ్యడంలో దిట్ట. ఏ పని చేసినా ఒక పద్దతిగా చేయడం రాముడు తాతగారిలొ ప్రత్యేకత. అది రోజు చేసే భోజనం కావచ్చు, తినే కంచంలో ఒక్క పదార్దం వదలకుండా ఒక్క మెతుకు మిగల్చకుండా తినేవారు. ఆన్నం పరబ్రహ్మ స్వరూపం అని చేతల ద్వారా చెప్పేవారు. నేను ఏ రోజైనా అలా తింటే నా భార్యతో 'మా రాముడు తాతగారిలా అందంగా తిన్నా ' అనడం రివాజు. రామకోటి రాస్తే ఒక పేజిలో లింగాకారంలో, ఒక పేజిలో ' శ్రీరామ ' నామాకారంలొ రాసి ముత్యాల్లాంటి అక్షరాలతో చూడముచ్చటగా ఉండేది.

మా పెద్దన్నగారు (మైదిలి) ఆయనలా ఆజానుబాహువు. మా చిన్నన్నయ్యకు (పవన్) మరియు నాకు మృదుభాషణ కొద్దిగా అలవడ్డాయి. మా తమ్ముడు (కిరణ్) ఆయనలాగె పొడుగరి. మా మావయ్య కుమారుడు (శ్రీరాం) ఆయనవలె చమత్కారి. కాని మాకెవ్వరికి ఆయనవంటి పరిపూర్ణత సిద్దించలేదు.

చిన్ననాడు ఆయన చెప్పిన కధలు నేటికీ నేను మరువలేదు. విరామం లేకుండా నేను అడిగే ప్రతి ప్రశ్నకు విసుగు లేకుండా ఆయన చెప్పిన సమాధానాలు నాలో ఆలొచించే స్వభావానికి పునాది వేశాయి. మేమంటే అపారమైన ప్రేమ చూపించేవారు. దినచర్యలో ఆయన చూపే నిబద్దత ఆదర్సప్రాయం. ప్రతి నెల క్రమం తప్పకుండా ఆయన పంపే కుశలప్రశ్నలతో నిండిన పోస్ట్ కార్డ్ కోసం ఎదురుచూసిన రోజులు ఎన్నో. ఒక్క కార్డ్‌లొ సకల విషయాలు పట్టించడంలో ఆయన చూపిన ప్రజ్ఞ ఎన్ని కమ్మ్యూనికేషన్ కోర్స్‌లు చేసినా రాదు. ఆ దస్తూరిలో అందం ఆయనకే సొంతం.

ఆయన నేను 7వ తరగతిలొ ఉండగా స్వర్గస్తులైనారు. వెళ్తూ కూడా నాకు ఒక కొత్త విషయం చెప్పారు, అబ్బాయి ఈ ప్రపంచంలో ఎవరూ శాశ్వతం కాదు అని. 7వ తరగతి విద్యార్దికి అది ఒక మహావిషయం. కాని ఈనాటికి ఆయనలేని లోటు తీర్చలేనిది. మా అభివృద్ధి చూసి ఆనందించేవారు, మాకు కష్టాలలో సలహా చెప్పేవారు. నా జీవితంలోని మరపు రాని మనిషికి అశ్రునయనాలతో.